Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్

  • 20 బోగీలతో సిద్​ధమైన రైలు
    ఈ నెల 8న ఏపీ పర్యటనలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలో మరో వందేభారత్ రైలు సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖల మధ్య నడిపేందుకు 20 బోగీల వందేభారత్‌ రైలు సిద్ధమైంది. విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్‌ వెళ్లి, తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకోవడం ద్వారా ఈ మార్గంలో వందే భారత్ రైలు ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.ఈ రైలులో 18 ఏసీ చైర్‌కార్‌ బోగీలతో పాటు, 2 ఎకానమీ చైర్‌ బోగీలు ఉన్నాయి.

ఈ నెల 8న ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-విశాఖల మధ్య వందే భారత్ రైలు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో కేంద్రం కొత్త రైలును ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలో ఇప్పటికే 20 ఆరెంజ్‌ రంగు బోగీలతో ఓ వందేభారత్‌ రైలు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం బయల్దేరి వెళ్లే 16 బోగీల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో కొత్త రైలును అందుబాటులోకి తెస్తారని. ఇందుకు భారతీయ రైల్వే శాఖ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.