Take a fresh look at your lifestyle.

శాంతి భద్రతలు, పౌరుల రక్షణ ముఖ్యవిధి

  • అక్రమ వ్యాపారాలు, అసాంఘిక చర్యలకు పాల్పడే వారి పట్ల ఉపేక్షించేది లేదు.
  • మహిళలను, పిల్లలను వేదింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు.
  • 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తాం.
  • సూర్యాపేట జిల్లా ఎస్పీ – K. నరసింహ

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ చెప్పారు.సూర్యాపేట జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు తీసుకున్న అనంతరం నిర్వహించడం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పౌరుల రక్షణ కు అధిక ప్రాధాన్యమిస్తూ జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విలువైన పోలీస్ సేవలు వేగంగా అందిస్తామని అన్నారు.మహిళల పట్ల, పిల్లల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల పిల్లల ఫిర్యాదులకు సంబంధించి అత్యంత వేగంగా పనిచేస్తామని తెలిపారు.ఈవ్ టీజింగ్ చేసే వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు.వ్యవస్థీకృత నేరాలు అదుపులో ఉన్నాయని ఇలాంటి నేరాలు జరగకుండా దృష్టి సారిస్తామని తెలిపారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి తరచుగా ఇలాంటి నేరాలు చేసే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పిడిఎస్ రైస్ అక్రమ మార్గంలో అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు అన్నారు. గంజాయి రవాణా, వినియోగం ఇసుక అక్రమ రవాణా,పేకాట లాంటి వాటిపై కటినంగా వ్యవహరించి అదుపు చేస్తామని తెలిపినారు. చదువుకున్నవారే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారని, సైబర్ మోసాల పై ప్రణాళికతో పని చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.డయల్ 100 కాల్స్ పై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు నిర్వహించుకునే పండుగలు,సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ రక్షణ కల్పిస్తామని తెలిపారు.చైన్ సిస్టమ్(మల్టీ లెవెల్ మార్కెటింగ్) వ్యాపారం మోసపూరితమైనదని, ఇలాంటి వ్యాపారం చేసే వారిపై సమాచారం ఇవ్వాలని, బాధితులు పిర్యాదు చేయాలని కోరారు.ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహ చారి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సీఐ లు రాజశేఖర్, వీర రాఘవులు, రఘువీర్ రెడ్డి, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, రజిత రెడ్డి, రాము, ఆర్ ఐ నారాయణ రాజు, నరసింహ, ఎస్సై లు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది ఉన్నారు.

  • ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి… బాధితులకు భరోసా ఇవ్వాలి
  • సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు.ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ జిల్లా పోలీసులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అందరూ జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు,పౌరుల రక్షణకు, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని చెప్పారు.అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణా పై ముందస్తుగా సమాచారం సేకరించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పోలీస్ శాఖ నందు సిబ్బందికి క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు.విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని వెల్లడించారు.మహిళలు, పిల్లలు సంభందించిన కేసుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలని,పేకాట, గంజాయి తరలింపు, ఇసుక అక్రమ రవాణా, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డీఎస్పీ లు, సీఐ లు పోలీసు విధులు, కేసుల దర్యాప్తు, కేసుల నమోదు, స్టేషన్ నిర్వహణ పై క్షేత్ర స్థాయిలో నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.