- సన్న బియ్యం పంపిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి జడ్చర్ల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేదింటి కుటుంబాలకు వరం లాంటిదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండు అన్ని విధాల ఆదుకునే విధంగా వివిధ రకాల సంక్షేమ పొలాలను పేదలకు అందించడం జరుగుతుందని అన్నారు.రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యం ప్రతి పేద కుటుంబానికి కడుపునిండా అన్నం తినే విధంగా ప్రభుత్వం సహాయపడుతున్నాయి అన్నారు. ప్రజలు సన్నబియాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.