మాదాపూర్, ముద్ర విలేఖరి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సంగీత నాటక అకాడమీ అవార్దీ కూచిపూడి నాట్య గురువర్యులు మద్దాలి ఉష గాయత్రీ శిష్య బృందం చే “కూచిపూడి విభావరి” ప్రదర్శించారు. వాతాపి గణపతి, స్వామినాథ, శివ దీక్ష, ప్రహ్లద పట్టాభిషేకం, బాల కనకమయ, చక్కని తల్లికి, శ్రీ కృష్ణ జనన శబ్దం, అలరులు కురియగా, గొల్లకలాపం, తిల్లాన అంశాలను వాసవి చౌదరి, ఆశ్రిత షిండే, యశస్వినీ శ్రీ, శ్రద్ధ వారణాసి, సహస్ర, చేరిష్య లు ప్రదర్శించి మెప్పించారు.
