- వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా,గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు.ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్,డిబీసీడిఓకె ఉపేందర్, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారులు మల్లేశం, కమలాకర్ రెడ్డి, డిపిఓ జయసుధ, డిఎంహెచ్ వెంకటరమణ, మిషన్ భగీరథ ఇఇ చల్మారెడ్డి, జిల్లా ఏబీసీడిఓ భీమరాజు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
