- ఏందీ ప్రభుత్వ పాలనా.
- ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్ఎస్ ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుంకి శాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. దీని మీద ఎక్స్‌పర్ట్ కమిటీ వేయరు,విచారణ కూడా చేపట్టరని ఎద్దేవా చేశారు. అలాగే విజిలెన్స్ కమిషన్ విచారణ ఉండదు జ్యుడీషియల్ కమిషన్ ఉండదని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా రాదన్నారు. ఇవేమీ లేకుండానే సైలెంట్ గా రిపేర్ చేయిస్తారని మండిపడ్డారు.కానీ అదే మేడిగడ్డలో రెండు ఫియర్స్ కుంగితే దానికి సంబంధించి అన్ని ఉంటాయన్నారు. ఎన్డీఎస్ఏ, ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్స్, ఇంకా వివిధ సంస్థలు ఆ పియర్స్ రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, కన్ స్ట్రక్షన్ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధం అని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థం తో తెలంగాణ ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టడం, కాంగ్రెస్ మార్కు “ప్రజా వ్యతిరేక-ప్రతిపక్ష వేధింపు ‘పాలనకు నిదర్శనమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.