Take a fresh look at your lifestyle.

మేడిపల్లిలో పట్టాలు రాని వారికి పట్టాలివ్వాలి – సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్

. ప్రజావాణిలో వినతి పత్రం సమర్పణ

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం భగత్ సింగ్ నగర్ కాలనీ సర్వే నెంబర్: 48లో 2007 లో అప్పటి ప్రభుత్వం జీ.వో. నెంబర్ 58 కింద కొంత మందికి పట్టాలు ఇచ్చిందని, మరికొందరికి వెరిఫికేషన్ దశలోనే ఆగిపోవడంతో పట్టాలు రాలేదనీ,పట్టాలు రాని వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వారు ఈ మేరకు కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, పట్టాలు పొందిన వారు ఈ భూమి మీద మాకే హక్కు ఉన్నదని, పట్టాలు లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలులేదని ప్రచారం చేయడంతో,పట్టాలు రాని వారు ఆందోళన చెందుతున్నారనీ, అందువల్ల పట్టాలు రాని వారిని గుర్తించి వెంటనే పట్టాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపధ్యంలో కొంత
మంది భూ కబ్జాదారులు ఈ భూమి మీద కన్నేసి డబ్బులు వసూలు చేసి కొత్త గుడిసెలు వేయిస్తున్నారని, ఈ విషయాన్ని స్థానిక తహసిల్దార్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలన్నారు. అయితే, కొత్తగా గుడిసెలు వేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసు కోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త గుడిసెలు పడకుండా నిజమైన లబ్దిదారులకు న్యాయం చేసే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. మేడిపల్లి మండల సిపిఐ కార్యదర్శి రచ్చ కిషన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్, ఉప్పల్ మండలం కార్యదర్శి సత్యప్రసాద్, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి లక్ష్మి, ఘట్కేసర్ మండల కార్యదర్శి ఈశ్వర్, మేడిపల్లి మండల నాయకులు సి.హెచ్ మాధవి, కె.ప్రమీల, దండు రమేష్, జయచంద్ర, జి. నాగరాజు, కే మహాలక్ష్మి, బాపురాజు, వి. బాలరాజ్, ఇస్తారీ, సోమరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.