ముద్ర, మోత్కూర్.:
గ్రామ పంచాయతీ లలో పనిచేసినటు వంటి కార్మికులకు ఒకటో తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మళ్లీ ఈ ఏప్రిల్ నెల నుంచి గ్రామపంచాయతీ నిధుల ద్వారానే వేతనాలు చెల్లించాలని ఆర్డర్ చేయడంతో నిరసనగా గ్రామపంచాయతీలో పని చేస్తున్నటువంటి కార్మికులు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా మోత్కూర్ పోలీసులు గ్రామపంచాయతీ సిబ్బందిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీల లో పని చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈ మల్టీ పర్పస్ విధానం తొలగించి గ్రామ పంచాయతీలో పని చేస్తున్నటు వంటి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చెల్లించాలని కోరారు. అరెస్టు అయిన వారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది మండల అధ్యక్షుడు సూరారం నాగయ్య, గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ వైస్ చైర్మన్ సూరారం భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది పోట్టేపాక సైదులు, సూరారం బుచ్చయ్య, లతీఫ్, మల్లేష్, సుదర్శన్, వెంకన్న తదితరులు ఉన్నారు