Take a fresh look at your lifestyle.

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి -మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య

 

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రైతులు తమ పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం, ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులోని గేదెలకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఏరియా ఆసుపత్రి పశు వైద్య సహాయ సంచాలకులు కె.పూర్ణ చందర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పశు సంపదను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. పశువులకు సోకే వ్యాధులను ముందే గుర్తించడం వల్ల పశువుల యాజమానులku నష్టం రాకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా గాలి కుంటు నివారణ టీకాలు తీయించుకోవాలని తెలిపారు. ఈ టీకాలు చూడి పశువులకు కూడా సురక్షితమన్నారు. ఈ వ్యాధి పశువులకు సోకితే తీవ్రమైన జ్వరం, పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందన్నారు. 3 నెలలు పై బడిన అన్ని గో జాతి, గేదె జాతి పశువులకు టీకాలు తీయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు వినోద్ కుమార్, రామకృష్ణారెడ్డి, ఎడి డాక్టర్ విజయలక్ష్మి, సిబ్బంది హాజీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.