Take a fresh look at your lifestyle.

సంగమేశ్వర దేవాలయా అభివృద్ధికి చేతనందిస్తా- తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్ ప్రతినిధి :

తాండూర్ నియోజకవర్గం లోని యాలాల్ మండలం కోకట్ గ్రామ శివారు నుండి సంగమేశ్వర దేవాలయం వరకు రూ.2.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అధికారులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.