Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలు సమాజ మార్పుకు పునాదులు-తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి:

వికారాబాద్ జిల్లాతాండూర్ పట్టణంలోని ఎస్ వి ఆర్ పంక్షన్ హాల్ లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాలలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేబాధ్యతఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎంత ఉందో గ్రామ సర్పంచ్ లకు, పట్టణ కౌన్సిలర్ లకు అంతే బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాల విషయంలో త్రాగునీరు, టాయిలెట్స్, పరిసరాల పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా అన్ని సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాం.
గతంలో 1/2 నెలలకు యూనిఫామ్, బుక్స్ అందించేవారు.మన ప్రభుత్వం వచ్చాక పాఠశాల ప్రారంభించే రోజే యూనిఫామ్, బుక్స్ అందిస్తున్నాం.
ఆర్థిక ఇబ్బంది ఉన్న, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
విద్య వ్యవస్థపై ఖర్చు చేసే ప్రతి పైసా ఖర్చు కాదు.. అది భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడని,మన పిల్లలను ఎంత బాగా చదివిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన పేర్కొన్నారు.
వికారాబాద్ హైదారాబాద్ కి దగ్గరలో ఉన్న, విద్యలో మాత్రం వికారాబాద్ జిల్లా అట్టడుగులో ఉంది. దాన్ని అధిగమించి ఈ సారి మనం ప్రథమ స్థానంలో ఉండాలి. విద్యా పరంగానే కాకుండా ఆటలు సంస్కృతికా కార్యకలాపాల్లో కూడా రాలించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.