జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
“ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి”
“బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడడమే మన ప్రధాన బాధ్యత”
“వేగంగా, పారదర్శకంగా కేసుల విచారణ జరగాలి”

జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లాలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, డయల్-100 కాల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజా ఫిర్యాదులపై స్పందన, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు నగదు రిఫండ్, దొంగతనం కేసుల డిటెక్షన్, మర్డర్ మరియు అనుమానాస్పద మృతి కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సైబర్ మోసాలు, మహిళా భద్రతపై ప్రజల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అలాగే పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సాయి వెంకట్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.