గద్వాల మున్సిపాలిటీ 16 వార్డులో పర్యటన
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సమస్యలు నేరుగా తెలుసుకుని, తద్వారా పరిష్కరించేందుకే వార్డుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ నర్సింహులు యాదవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం గద్వాల మున్సిపాలిటీ లో 16వ వార్డు కౌన్సిలర్ వేదావతి వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి వార్డులో పర్యటించి ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. భీంనగర్, రెవెన్యూ కాలనీ, తదితర కాలనీలో డ్రైనేజీ, తాగు నీరు, రోడ్ల మరమ్మతు తదితర సమస్యలపై ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణాలపై స్థానిక కౌన్సిలర్, నాయకులతో కలిసి సమీక్షించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో భీంనగర్, రెవెన్యూ కాలనీలో పెండింగ్ లో ఉన్న సీసీరోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. అలాగే వార్డులో అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే కృష్ణానది మెయిన్ రోడ్డుకు ఆక్రమించుకొని నిర్మించిన ఇండ్ల నిర్మాణాలను కూడా తొలగించి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జానకీరామ్ సాగర్, నాయకులు నాగ శంకర్, సుంకన్న, మధు, మధు ముదిరాజు, తిరుమల్ రెడ్డి, వీరేష్, సత్యం, వార్డు ఆఫీసర్లు, జవాన్ తదితరులు పాల్గొన్నారు.