ముద్ర విలేఖరి, మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభు మఠము ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నాడు అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రస్ట్ అధ్యక్షులు కొండా లక్ష్మీకాంతరెడ్డి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన రాగి అంబలి వేసవిలో మనిషి ఆరోగ్యానికి గొప్ప ఔషధం వంటిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్త పీఠాధిపతులు జంగం చంద్రశేఖరప్ప, శ్రీ వారణాసి రామయ్య గారి శిష్య మండలి సభ్యులు పాల్గొన్నారు.
