కోరుట్ల, ముద్ర విలేఖరి: తీవ్ర మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది స్థానికులు అందించిన సమాచారం ప్రకారం కోరుట్ల పట్టణం భీమందుబ్బకి చెందిన వడ్లకొండ వశిష్ట కరీంనగర్ లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవు నిమిత్తం కోరుట్ల కి వచ్చి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పరిశీలిస్తున్నారు.