- జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రైసింగ్ 1 నినాదంతో ముందుకు సాగుతూ, శాంకేతిక రంగంలో రాష్ట్రన్ని నంబర్ 1 గా తీర్చి దిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబు ల సహకారం, సంకల్పం మేరకు జగిత్యాల నియోజకవర్గం వర్గంను సాంకేతిక రంగంలో యువతను తిర్చిదిద్ధడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల టీఆర్ నగర్ సమీపంలో రూ. 29 కోట్లతో నిర్మాణం చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఎటిసి) పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.జగిత్యాల కరీంనగర్ రహదారికి సుమారు 800 మీటర్ల దూరంలో నిర్మిస్తున్నఐటిఐ ఏటీసీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన రహదారి సౌకర్యాలు కల్పించడానికి జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్, డివిజన్ సర్వేయర్ విట్టల్ తో కలిసి పరిశీలించి, తాగు సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 6 .15 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వాణి నగర్, బిగ్ బజార్, బోయవాడ, పురానిపేట లో గంగమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ ఛైర్మెన్లు ఆడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం , మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
