Take a fresh look at your lifestyle.

ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా నిరసన

  • దిష్టిబొమ్మ దహనం చేసిన హిందూ సంఘాల నాయకులు.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన కూడలి గుండా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు.అనంతరం పాలమూరు కూడలికి చేరుకొని పలువురు మాట్లాడారు.కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయకులను బలి తీసుకోవడం పిరికిపంద చర్య అని అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంగా భావించి ఉగ్రవాదులను తొక్కి అణచివేయాలని, కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధి చెంది అక్కడి సామాన్యులకు యువతకు ఉపాధి లభిస్తున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగానే దాడులకు పాల్పడ్డారని అన్నారు.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బిజెపి, బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ ఐక్యవేదిక, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.