Take a fresh look at your lifestyle.

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు – మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ రాఘవేందర్ మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు పరమేశ్వర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లగిశెట్టి కోదండరాములు పాల్గొన్నారు. అలాగే క్లాస్మేట్ క్లబ్ మహిళా అధ్యక్షులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.