Take a fresh look at your lifestyle.

ఘనంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత జయంతి వేడుకలు- భారీ సంఖ్యలో హాజరైన హిందూ బంధువులు

 

ముద్ర, తాండూర్:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ హిందూ బంధువుల హిందూ సమ్మేళనం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని అయ్యప్ప నగర్ లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ హక్కే ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా కేసరవెల్లిలోని భువనేశ్వరి పీఠాధిపతి ప్రముఖ హిందూ ధార్మిక ప్రవచనకర్త పూజ శ్రీ కమలానంద భారతి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సమాజం లో కుల మత ప్రాంతీయ బేధాలు లేకుండా, బీద ధనిక తార తమ్యం లేకుండా హిందువులను సంఘటితంగా ఉంచడంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేస్తున్న కృషి అభినందన నియమని, ఏ ప్రభుత్వాల సహకారం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు, పాఠశాలలు వైద్యశాలను స్థాపించి సమాజాభివృద్ధికి, హిందూ సమాజం విచ్ఛిన్నం కాకుండా సమాజమే సంఘం, సంఘమే సమాజం అన్న ధోరణిలో ఎంతోమంది దేశభక్తులను, విద్యావంతులను, మేధావులను సమాజానికి అందిస్తున్న ఘనత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దే అని ఆయన పేర్కొన్నారు. కావున సమాజం విచ్చినం కాకుండా హిందూవులంతా ఐక్యంగా ఉండి భారతీయ సంస్కృతిని హిందూ సంప్రదాయాలను కాపాడాలని హిందూ సోదరులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండూర్ పట్టణ హిందూ బంధువులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.