Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ 10వ వార్డులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ వల్ల 10వ వార్డు పరిధిలో విద్యుత్ ఒత్తిడి తగ్గి, మెరుగైన సరఫరా అందుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.