పుర ఎన్నికల్లో 890 మంది అభ్యర్ధుల నామినేషన్లు
కాంగ్రెస్ నుంచి 382
బీఆర్ఎస్ నుంచి 258
బీజేపీ నుంచి 169 నామినేషన్లు దాఖలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
వచ్చే నెల పదకొండో తేదిన రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం బుధవారం మొదలైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో 890 మంది అభ్యర్ధులు.. మొత్తం 902 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 387, బీఆర్ఎస్ నుంచి 258, బీజేపీ నుంచి 169 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీ నుంచి మొత్తం 809 నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన అభ్యర్ధులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డుల్లో ఈ నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. కాగా ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకముందే బలమైన అభ్యర్ధులను రంగంలో దింపేందుకు వ్యూహత్మక అడుగులు వేస్తున్నాయి. ఇదీలావుంటే రాష్ట్రంలో పోటీకి సిద్ధమని ప్రకటించిన జనసేన పార్టీ ప్రధాన పార్టీలను ఢీ కొట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలను ప్రకటించింది. శంకర్ గౌడ్ (రంగారెడ్డి), సాగర్ ఆర్కే నాయుడు (కరీంనగర్ ) రాధారాం రాజలింగం (మెదక్), ముమ్మారెడ్డి ప్రేమకుమార్ (మహబూబ్‌నగర్), మడి రెడ్డి దామోదర్ రెడ్డి (వరంగల్), మేకల సతీష్ రెడ్డి (నల్గొండ), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), మాచ సుధాకర్ (నిజామాబాద్), మంథని సంపత్ కుమార్ (ఆదిలాబాద్) లను సభ్యులుగా ప్రకటించింది. మరోవైపు.. ఈ పార్టీ పెద్దపల్లిలో పార్టీ తొలి నామినేషన్ వేసింది. పెద్దపల్లి 9వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి సుమ – యాదవ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.