Take a fresh look at your lifestyle.

అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

-4ట్రాక్టర్ల సీజ్     
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
 జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా  ఆదేశానుసారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతట్టి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు (4) ట్రాక్టర్లను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న సదరు ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేసి, బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు డ్రైవర్లతో పాటు, ట్రాక్టర్ల యజమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.