- దళారులను హాస్టల్లోకి రానివ్వద్దు.
- నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్.
ముద్ర ప్రతినిధి, హనుమకొండ: ప్రభుత్వ హాస్టల్స్ లలో విద్యార్థి సంఘాల పేరుతో చందాలకు గాని వసూళ్లకు గాని పాల్పడితే కేసులు నమోదు చేయండి అని అధికారులను నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్.సూచించారు. సంఘాల వారికి మామూలు ఇవ్వడం వల్ల హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువైందని ఘాటుగా విమర్శించారు. హాస్టల్లో హెడ్మాస్టరు, వార్డెన్లు తప్పు చేయొద్దని, మధ్య దళారులకు భయపడి వారికి మామూలు ఇవ్వకూడదని తెలిపారు.శనివారము హనుమకొండ జిల్లా కేంద్రం లోని జులైవాడలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని, 400 మంది కి పైగా ఉండే విద్యార్థుల కొరకు కనిస సౌకర్యాలు కరువయ్యాయని వాపోయారు. పాఠశాల అంటే మంచి విద్యాబోధన, ప్రభుత్వ మెను ప్రకారము ఆహారం అందేలా చూడాలని అన్నారు.విద్యార్థులకు కేటాయించే నిధులలో విద్యార్థి సంఘాలు వసూళ్లకు పాల్పడే బ్యాచులు ఉన్నన్ని రోజులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఉండదని పేర్కొన్నారు. అలాగని వార్డెన్ హెడ్మాస్టర్లు ప్రిన్సిపాల్ లు తప్పు చేస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. ప్రతి ఆదివారం నాడు పండగ వాతావరణం ను తలపించలా కల్చరల్ ప్రోగ్రామ్లు ఏర్పాటు తో హాస్టల్ వాతావరణ ఉండాలని తెలిపారు.ప్రతిరోజు గుడ్డుతోపాటు, చికెన్, మటన్ పండ్లు అందించాలని, విద్యార్థినులకు హాస్టల్కు వచ్చిన తర్వాత ఇల్లు గుర్తు రాకుండా ఉపాధ్యాయులు, వార్డెన్లు తల్లిదండ్రుల మాదిరిగా వారిని చూసుకోవాలని , వారి సొమ్మును దోచుకోవాలని చూస్తే ఎస్టీ కమిషన్ ఊరుకోదని హెచ్చరించారు. జులైవాడ హాస్టల్ ఎన్నో సంవత్సరాలుగా వేలాదిమంది విద్యార్థులకు బోధన అందించారని కానీ వారిని ఉన్నత స్థానంలో నిలపడంలో ఉపాధ్యాయుల బృందం విఫలమైందని ఆరోపించారు. త్వరలోనే హాస్టల్ కు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏమైతే ఉన్నాయో .. తనకు పంపించాలని అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశలో.. ఎస్టి కమిషన్ చొరవ తీసుకుంటుందన్నారు. హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్, ప్రొజెక్టర్లు, రెండు నెలల లోపు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులతో ముఖాముఖి విద్యార్థినులతో జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు ముఖాముఖి నిర్వహించారు. ఒక్కో విద్యార్థిని హాస్టల్లో ఉన్న సమస్యలపై మాట్లాడాలని కోరగా.. హాస్టల్లో క్రీడస్థలం లేదని, వాటర్ ప్లాంట్ లేదని, క్లాసులు చెప్పేందుకు ప్రొజెక్టర్లు లేవని.. విద్యార్థులు కోరగా అన్ని ఏర్పాట్లు తానే దగ్గర ఉండే చేపిస్తానని.. అలాగే క్రీడల కోసం.. హాస్టల్ లో క్రీడా మైదానం ఏర్పాటు చేద్దామన్నారు. రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నత స్థాయిలో ఉండేలా మొదటినుండి ఇంగ్లీష్ ,హిందీ బాగా నేర్చుకోవాలని.తెలుగు మాట్లాడితే తెలంగాణలోనే ఉంటారని, హిందీ మాట్లాడితే ఇండియా అంతా తిరుగుతారని, ఇంగ్లీష్ మాట్లాడితే ఇతర దేశాల్లో సైతం వెళ్తుంటారని ఆయన పేర్కొన్నారు. చదువును ఇష్టపడి చదవాలని కష్టంతో చదివితే ఉన్నతశ్రేణిలో రాలేమని చెప్పారు. విద్యార్థులు పోటీ తత్వంతో చదువులో పోటీ పడాలని, 10/10 మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఎన్సిసి ,స్కౌట్స్, క్రీడలలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి గిరిజన విద్యార్థులు ఎన్నిక కావలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీవో రమేష్ రాథోడ్, ఐటిడిఏ ఏపీఓ వసంత్ జాదవ్, హనుమకొండ డిటిడిఓ ప్రేమ కళ, వరంగల్ డిటిడిఓ సౌజన్య, హెడ్మాస్టర్ రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వినోద్ లోక్ నాయక్, బిఆర్ ఎస్ నాయకులు మునావత్ నరసింహ నాయక్, స్టేషన్గన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, మాజీ ఎంపిటిసి సోము, కేయూ విద్యార్థి సంఘం నాయకులు గుగులోతు రాజు నాయక్, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు అజ్మీరా వెంకట్, గోర్ సేన జిల్లా అధ్యక్షులు తేజావత్ ఫణి కుమార్, జి బి ఎస్ ఎస్ ఎస్ కోశాధికారి, కార్యదర్శిగుగులో తిరుపతి, గుగులోతు వినేష్ విద్యార్థులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
