Take a fresh look at your lifestyle.

ఓటరు జాబితాలో తప్పులు ఉంటే అధికారులపై చర్యలు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.

ఓటరు జాబితాలో తప్పులు ఉంటే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, ఇంటింటి సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన బిఎల్ఓలకు తాకిదులు తప్పవని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య స్పష్టం చేశారు . ప్రతి ఇంటికి వెళ్లి నిజమైన ఓటర్లను గుర్తిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈ ఆర్ఓలు, ఏఈఆర్ఓ లు, బిఎల్వోలు, సూపర్వైజర్ల ను ఆదేశించారు .
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లు, బిఎల్వోలు, సూపర్వైజర్లతో వీడియో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పక్రియను వేగవంతం చేయాలని అన్నారు . ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం నిర్వహించే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలు కీలక పాత్ర పోషించాలని అన్నారు .బిఎల్ఓ లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు . ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పక్రియలో నిర్లక్ష్యం వహించే బిఎల్వోలకు తాకిదులు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బిఎల్వో తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బిఎల్వోలు లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే బిఎల్వోలను నియమించాలని ఈఆర్ఓ లను ఆదేశించారు . ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం 13 కేటగిరీలలో బిఎల్వోలను నియమించుకోవచ్చని అన్నారు . బిఎల్వోల వివరాలను ఈసీఐ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్ఓలు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు,ఆర్డీవో రాజేందర్,ఎన్నికల విభాగం సెక్షన్ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.