Take a fresh look at your lifestyle.

ఘనంగా గోలి పింగల్ రెడ్డి జన్మదిన వేడుకలు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బీబీనగర్ మండల కేంద్రంలో పింగల్ అన్న సేవాదల్ ఘనంగా నిర్వహించింది. పింగల్ అన్న సేవాదల్ అద్యక్షుడు ఎండీ మోయిన్ శాలువాతో సన్మానించి ,పుష్పగుచ్చాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదల పెన్నిధిగా, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ప్రజానీకానికి మరింతగా సేవలు అందించాలని, ఆ భగవంతుడు అందుకు అనుగుణంగా ఆయనకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా దేవుణ్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ. అక్బర్,   పింగల్ అన్న సేవాదల్ గౌరవ అద్యక్షుడు కాసుల రఘునందన్ గౌడ్, నాయకులు తుమ్మల నరసింహ రెడ్డి, తంగళ్లపల్లి రవి కుమర్, ఎలుగల నరేందర్, శేఖర్, కాసుల అజయ్ కుమార్, గండు రమేశ్, ఉట్కూరి నాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.