Take a fresh look at your lifestyle.

ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి : సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు మరియు ఇతర పేర్లతో పనిచేస్తున్న కార్మికులందరికీ రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఆఫీసులో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజున సిఐటియు తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చంద్రారెడ్డి, మల్లేశంలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అప్పటివరకు సబ్స్టేషన్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్న వారిని ఆర్టిజన్ వర్కర్ గా పేరు మార్చుతూ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లుగా విభజించి తరతమ తేడాలతో వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం వీరితో వెట్టి చేయించుకుంటుందని అన్నారు. ఒకే స్వభావం కలిగిన పనిని రెగ్యులర్ ఉద్యోగి మరియు ఆర్టిజన్ వర్కర్ పనిచేస్తున్నప్పటికీ, రెగ్యులర్ ఉద్యోగికి ఇస్తున్న వేతనం గాని, సౌకర్యాలు గాని ఆర్టిజన్ వర్కర్ కు అందడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కన్వీనర్ బొట్ల రమేష్, కో కన్వీనర్ ఎడ్ల వెంకటేష్, రాష్ట్ర కంపెనీ కో కన్వీనర్ పాండరిరెడ్డి, వైస్ చైర్మన్లు సాగిన రమేష్, బొట్ల నర్సింగరావు, పిసీఏలు, పిఏలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.