- వివేక్‌కు కార్మిక, న్యాయ, క్రీడల శాఖలు.
- అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు.
- వాకిటి శ్రీహరి కి క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్థక శాఖలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు.అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్, వాకిటి శ్రీహరి కి క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్థక శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్ తో సుదీర్ఘ చర్చల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వెంటనే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి.అయితే రేవంత్ రెడ్డి వాటిని కొత్త మంత్రులకు కూడా కేటాయించలేదు. సీనియర్లలో కొంత మంది ఆ శాఖలు తమకు కేటాయించేలా ఆదేశించాలని హైకమండ్ వద్ద లాబీయింగ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్కతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందని అనుకున్నారు. వారు ప్రధానంగా తమకు హోంశాఖ ను కేటాయించేలా ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖను తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. అంతే కాదు.. మున్సిపల్ శాఖ, విద్యా శాఖను కూడా ఇతర మంత్రులకు కేటాయించలేదు. ఇప్పటికీ కేబినెట్ లో మూడు ఖాళీగా ఉన్నాయి. ఒక వేళ ఆ మూడు స్థానాలను భర్తీ చేస్తే.. పదవులు పొందేవారికి అత్యంత కీలక శాఖలు లభించే అవకాశాలున్నాయి. తాజా విస్తరణతో క్యాబినెట్ లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా.. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు.