Take a fresh look at your lifestyle.

వైద్యునిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి ఎంఎల్ఏ ఏలేటి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యులు డాక్టర్ చిటికేశి సంతోష్ రాజ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దాడికి గురైన డాక్టర్ ను ఎమ్మెల్యే శుక్రవారం పరామర్శించారు. దాడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్యునిపై దాడి చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. న్యాయం చేయాలని వైద్యులందరూ రోడ్డెక్కితే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.