ముద్ర సంగారెడ్డి,మార్చి:
జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆర్.డి. మాధురి సూచించారు.
డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ(డీ సీసీ) మరియు జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డి ఎల్ ఆర్ సి) సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు.
సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.డి.మాధురి అధ్యక్షత వహించగా,జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు సమావేశాన్ని సమన్వయం చేశారు.ఈసమావేశానికి ఆర్బిఐ ఏజిఎమ్ శ్రీనివాస్ వెన్న,నాబార్డ్ ఏజిఎమ్ /డి డి కృష్ణతేజ,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సిద్దిపేట శ్రీనివాస్,జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు,అన్ని బ్యాంకుల కంట్రోలర్లు హాజరయ్యారు.
సమావేశంలో డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరాలు సమర్పించారు. జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.2244.72 కోట్లకు గాను 65.93 శాతం,మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.4232.98 కోట్లకు గాను 62.97 శాతం,మొత్తం అడ్వాన్సులు రూ.16082.57 కోట్లకు గాను 68.89 శాతం సాధించినట్లు తెలిపారు.
అదే విధంగా విద్యా రుణాలు, గృహ రుణాలు,ఎంఎస్ఎంఈ రుణాలు,స్వయం సహాయక సంఘాల రుణాలు తదితర రంగాల వారీగా లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమావేశంలో చర్చించారు.
ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ, ప్రాధాన్యతా రంగాల రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చురుకుగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్బిఐ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకులకు కేటాయించిన గ్రామాల్లో ప్రధానమంత్రి జనసురక్ష పథకాలు , పీఎంజెజెబివై ,పీ ఎంఎస్ బి వై, ఏపివై)పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మంది లబ్ధిదారులను నమోదు చేయాలని సూచించారు. రీ- కే వై సి ప్రక్రియను పూర్తి చేయడం, నిర్విరామంగా ఖాతాలను నిర్వహించుకోవడం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.నాబార్డ్ ఏజిఏం కృష్ణతేజ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసిసి ), పశుసంవర్ధక,మత్స్యరంగ రుణాల కింద అర్హులైన లబ్ధిదారులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.
ఈసమావేశంలో జడ్పీసీఈఓ జానకి రెడ్డి ఎస్సీ,పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్ ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్లు,డిఆర్‌డిఏ,డిఐసి తదితర విభాగాల అధికారులు,బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.