ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజు జోగిపేట లో మెప్మా ఆధ్వర్యంలో మెగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు.క్యాంపులో కౌమార బాలికల హెల్త్ హిమోగ్లోబిన్,షూగర్,అధిక బరువు పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి హాజరైన బాలికలకు 6 రకాల పుస్తకాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ , మున్సిపల్ కమిషనర్ రవీందర్,ఇంచార్జి సూపరిండెంట్ అశోక్,డా.నితిన్,డా.బాంధవి మెప్మా టిఎంసి బిక్షపతి గౌడ్, మెప్మా ఆర్పీలు,ఆశా వర్కర్లు,ఐసిడిఎస్ సూపర్ వైసర్ లు హాజరయ్యారు.