Take a fresh look at your lifestyle.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ముద్ర, కోరుట్ల;
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పార్టీని స్థాపించి అన్ని వర్గాలను ఏకం చేయడానికి అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని, ఇప్పటికి ఎప్పటికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్ట సురేందర్, వసీం, మోసిన్, కొక్కెర వెంకటేష్, నాయకులు మోహన్ రెడ్డి, సజ్జు, ఎలుగురి కిరణ్, జాల వినోద్, గెల్లె శ్రీనివాస్, గెల్లె గంగాధర్, అడేపు నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.