ముద్ర, కోరుట్ల;
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రోజు ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చెర్ పర్శన్ పులి శిరీష హరిప్రసాద్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారుల వద్ద అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యానికి సరైన ధర లబిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, కథలాపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు న్యావనంది శేఖర్, సర్పంచులు, ఏపీమ్ రాజయ్య, ఉపసర్పంచ్ లు డైరెక్టర్లు, ఏఈవో లు, కార్యదర్శి లు, కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామ రైతులు మహిళ సంఘాల లీడర్లు, తదిరులు పాల్గొన్నారు.