Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో ఉగాది వేడుకలు: మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో జాగ్రత్తలు

కరీంనగర్:

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్..కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మెన్ సత్తు మల్లేష్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు..

 

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ ఉగాది సందర్భంగా రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నా..

ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుతున్న..ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది

గవర్నర్ గారి ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుంది..జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలి.. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారు..

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళు.. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారు.అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనం

మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారు..తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది..తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానపరిచారు..

తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటి..మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపారు.ఎక్కడ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం .ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు.. మూసి అభివృద్ధి చేసి పేదలకు జీవనోపాధి కల్పిస్తాం .తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలీ

Leave A Reply

Your email address will not be published.