కోరుట్ల/కథలపూర్, ముద్ర: స్కూల్ బస్ ఢీ కొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మొగుళ్ళ ఎర్రయ్య (70) ఉదయం హోటల్ లో టీ తాగి వెళ్తున్నాడు.ఈ క్రమంలో కోరుట్ల కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్లో వెళ్తూ బలంగా ఢీ కొట్టింది.డ్రైవర్ అజాగ్రత్త వలనే జరిగిందని,తీవ్ర గాయాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు బందువులు వెల్లడించారు.మృతదేహాన్ని స్థానిక కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ తెలిపారు.
