కోరుట్ల, ముద్ర: కోరుట్ల పట్టణంలో గల అంగడి బజార్ ప్రధాన కూడలిలో జాగృతి నాయకులు కొండ యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా వెయ్యి మంది కార్మికులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జాగృతి నాయకులు కొండ యుగంధర్ గారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా సమాజానికి ఎనలేని సేవ చేస్తున్న కల్వకుంట్ల కవిత పేద ప్రజలకు ఏ కష్టం వచ్చిన ముందుండి తనవంతు సహాయ సహకారాలు అందిస్తురన్నారు.తన సమాజ సేవ, అభివృద్ధి పనులతో కలకాలం నిలిచిపోయే విధంగా చరిత్రలో, ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు.అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కార్మికుల పక్షాన జాగృతి నాయకులు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కొండ యుగంధర్, మహ్మద్ జావీద్, నీలగిరి రాజెంధర్ రావు, పోతారం రమేష్, వి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.