గొల్లపల్లి, ముద్ర: జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి మండల కేంద్రంలోని కురుమవాడ లో జిల్లా విద్యుత్ అధికారి ఎస్ ఈ సలియా ఆధ్వర్యంలో గురువారం100 కెవిఎ త్రీ ఫేస్ విద్యుత్ ట్రాన్సఫార్మర్,సబ్ స్టేషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన్నారు.అనంతరం ఎస్ ఈ సలియా,డి ఈ గోపి కృష్ణ, ఏఈడి వరుణ్ కుమార్,ఏఈ రాజేష్ కుమార్ లను మాజీ వార్డ్ నెంబర్ గురజాల బుచ్చిరెడ్డి, వార్డ్ సభ్యులు కలిసి శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా భద్రత పొదుపు సూచనలు, రైతులకు మీటర్ల వద్ద కెపాసిటర్ ఏర్పాటు వలన కలిగే లాభాలు గురించి వివరించడం జరిగిందాని వారు తెలిపారు.రాబోయే వేసవి దృష్ట్యా అన్ని గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకై అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ సలియా,డి ఈ గోపికృష్ణ,సివిల్ ఏడీఈ అనుప్,గొల్లపల్లి ఏడిఈ వరుణ్ కుమార్,ఏఈ రాకేష్ కుమార్,గురజాల బుచ్చిరెడ్డి,విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.