ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శ్రీ సరస్వతి శిశు మందిరాలు క్రమశిక్షణకు మారుపేరని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కావ్య, గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బాగులవాడ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదివి రాజకీయంగా ఎదిగిన మున్సిపల్ పాలక వర్గంలోని తమ విద్యార్థులను పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. తాము చదువు చెప్పిన పిల్లలు ఉన్నతంగా ఎదిగినప్పుడు ఆనందపడేవారి లో ముందువరుసలో గురువులే ఉంటారన్నారు. పూర్వ ప్రధానాచార్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన దంపతులు సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు కావటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజు, గోపు గోపి, శ్రీకాంత్ యాదవ్, సాదం అరవింద్, గంజి రాజు, ధర్మాజీ గారి రమ్య, అన్నపూర్ణ శివ కృష్ణ, శశాంక్, తదితరులు పాల్గొన్నారు.