Take a fresh look at your lifestyle.

డాక్టర్ ఏ ఎస్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలి

 

ముద్ర: కాప్రా

మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డాక్టర్ ఏఎస్ రావు నగర్ హౌసింగ్ సొసైటీ పర్సనల్ ఇన్చార్జ్ ఈశ్వరయ్య, దాశరధి థియేటర్ అధ్యక్షులు ఎస్ వినయ్ కుమార్ పేర్కొన్నారు. మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు డాక్యుమెంటరీ ఫిలిం కు గద్దర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏఎస్ రావు నగర్ లోని డాక్టర్ హోమీ జే బాబా కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన అభినందన సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు,డాక్టర్ ఏఎస్ రావు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అన్నారు. మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో ఆయన నిజ జీవితాన్ని డాక్యుమెంటరీగా సినిమాను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఏఎస్ రావు డాక్యుమెంటరీ ఫిలిం కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈసీఐఎల్ సంస్థను స్థాపించి ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ ఏఎస్ రావు అని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మాట్లాడుతూ… డాక్టర్ ఏఎస్ రావు హైదరాబాద్ నగరంలో ఈసీఐఎల్ సంస్థను స్థాపించి వేల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. డాక్టర్ ఏఎస్ రావు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిలిచారన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వేల మంది యువ ఇంజనీర్లను దేశానికి అందించిన గొప్ప మేధావి ఏఎస్ రావు అని కొనియాడారు. ఈ సందర్భంగా మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు డాక్యుమెంటరీ ఫిల్మ్ లో నటించిన కళాకారులకు, చిత్ర యూనిట్ సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో అభినందించారు. జి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాశరధి థియేటర్ ఉపాధ్యక్షులు భూపతి వెంకటేశ్వ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.