Take a fresh look at your lifestyle.

అందరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి

 మంథని, ముద్ర: ఆధ్యాత్మికత పెంపొందించుకుంటే మనిషి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందవచ్చని బ్రహ్మశ్రీ కుప్పా శ్రీనివాస శాస్త్రి అన్నారు.శనివారం స్థానిక శ్రీ శీలేశ్వర-సిద్దేశ్వర స్వామి దేవాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞంలో భాగంగా శనివారం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.ఉదయం 8:30 గంటల నుండి 1 గంట వరకు గురు వందనము,నిత్య పూజ, గాయత్రి జప సమాప్తి,ఋగ్వేద పారాయణ స్వాహాకారము అలాగే సాయంత్రం 5 గంటలకు సుహాసినిలచే స్తోత్ర పారాయణం ప్రదోష పూజ, ఆదివారం చివరి రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పునీతులు కావాలని నిర్వాహకులు చింతలపల్లి ఉమా శంకర్ గణాపాఠి, ఒజ్జల గణేశ్ అవధాని, ఆమ్నాయవర్ధిని మిత్రబృందము తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.