ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల చేసుకుంటే 25 శాతం తగ్గింపు వర్తిస్తుందని, దీనిని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పైన అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మున్సిపల్,ఎంపీడీవో,ఎంపీఓ,సబ్ రిజిస్టర్ అధికారులు సంబంధిత అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండల వారిగా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వివరాలను మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎన్ని దరఖాస్తులు చేస్తారు మండల వారిగా ఆరా తీశారు.కచ్చితంగా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల లబ్ధిదారులు క్రమబద్దీకరణ పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల లే అవుట్ క్రమబద్దీకరణ పైన పలు అంశాలపై పై దిశా నిర్దేశం చేశారు.ఎల్ ఆర్ ఎస్ పైన ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఎంపీడీవో ,ఎంపీవోలు ఆదేశించారు.అధికారులకు ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ నెల 31 వరకు చివరి రోజు కావున ఎక్కువ మొత్తంలో దరఖాస్తుల చేపట్టాలని అన్నారు.ఎల్1 ఎల్ 2 ఎల్ 3 రెవిన్యూ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.లే అవుట్ క్రమబద్దీకరణ అనేది ప్రభుత్వం సామాన్య ప్రజలకు భారం తగ్గించాలని అనే ఉద్దేశంతో ఎల్ ఆర్ ఎస్ రాయితీ ఇచ్చింది అన్నారు.మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యెక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అని ఏమైనా సలవాలు ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్లోని సంప్రదించాలని ప్రవేట్ బిల్డర్స్ కు తెలిపారు.ఈ సమావేశంలో,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, డిపిఓ మధన్ మోహన్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.