తుంగతుర్తి, ముద్ర : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డా. గాదరి కిషోర్ కుమార్ ల సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో బుధవారం చేరారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ పెరుమల రమేష్ కటకం నందన్ దురుసుజు శివ షేక్ బాషా, బొంకూరి రాంబాబు ,పోలేపల్లి కిరణ్ ,కాగు సతీష్, పులిగుజ్జు మహేష్, లతోపాటు పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, తడకమళ్ళ రవి, మాజీ ఎంపిటిసి దుర్గయ్య, తుంగతుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.