ముద్ర, శేరిలింగంపల్లి:
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ లో ఎమ్మెల్యే ఎస్. డ. ఎఫ్. నిధులు రూ.20 లక్షల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సాయి వైభవ్ కాలనీ లో ఎమ్మెల్యే నిధులు రూ. 20 లక్షల రూపాయల అంచనావ్యయం తో కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కమ్యూనిటీ హల్ నిర్మాణం ద్వారా కాలనీ లో చిన్న చిన్న సమావేశాలు, సభలు , బర్త్ డే కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉంటుదన్నారు. కమ్యూనిటి హాల్ నాణ్యత ప్రమాణాల తో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ను త్వరితగతిన చేపట్టి ప్రజలకు, కాలనీ వాసులకు అందుబాటులో కి తీసుకురావాలని, సాయి వైభవ్ కాలనీ వాసుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు పద్మ, సుజిత్, శ్రీనివాస్, సత్యనారాయణ, పవన్, సిద్దార్థ్, నవీన్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.