Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పెన్షనర్లకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోనమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.మార్చి 2024 నుండి రిటైర్ అయిన పెన్షనర్లకు ఇంతవరకు 23 నెలలు గడచిన కూడా బకాయిలు రానందున వారు తీవ్ర మానసిక ఒత్తిడి గురై ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు వదిలారన్నారు.సుమారు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి వీరంతా ఉద్యోగ విరమణ చేస్తే వీరిలో కొంతమంది ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్న కూడా కోర్టు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా బకాయిలు విడుదల చేయకపోవడం చాలా శోచనీయం అని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం మార్చి ఒకటో తారీకు లోగా బకాయిలు చెల్లించకుంటే మార్చి 2 నుండి ఇందిరాపార్క్ వద్ద కుటుంబ సభ్యులతో నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు రాజిరెడ్డి, శంకర్రావు, భగవాన్ రెడ్డి, ఎండి కుదరథ్ అలీ, సురేందర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.