Take a fresh look at your lifestyle.

విద్యుత్ కార్మికుల వంటావార్పు

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది.

గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ధర్నా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్టిజన్ కార్మికులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏపీఎస్సిబి రూల్స్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని,ఆర్టిజన్ కార్మికుల ను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని మరియు మీటర్ రీడింగ్ వర్కర్లను మరియు పోల్ టు పోల్ వర్కర్లను ఎఫ్ఓసి వర్కర్లను కూడా విద్యుత్ సంస్థలను విలీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని జోగిపేట్ డివిజన్ విద్యుత్ కార్మికుల కు ఎస్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ వెంకట్ నాయక్ మరియు 327 యూనియన్ నాయకులు లక్ష్మయ్య, మొగులయ్య, బాలరాజ్, కృష్ణ దేవరాయలు, మల్లేశం మరియు హెచ్82 ట్రాన్స్కో భాను ప్రకాష్ డిమాండ్ చేశారు.కార్మికులకు మద్దతుగా కార్యక్రమానికి మద్దతు తెలిపారు అనంతరం యాజమాన్యం ప్రభుత్వం కరెంట్ కార్మికుల కు న్యాయమైన హక్కులు ఇవ్వడానికి వెనుకడవద్దనీ 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో నుండి వచ్చి విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా పని చేస్తున్న కార్మికులకు ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు టీవీజేఏసీ నాయకులు రంజిత్, జోగినాథ్, రాజేందర్, సాయిలు, పవన్, నాగరాజు, మల్లేశం, సుధాకర్, హరికృష్ణ సురేష్, మక్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.