Take a fresh look at your lifestyle.

స్థానికంగా సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధం

  • బీజేపీ అచ్చంపేట పట్టణ అధ్యక్షులు గండు శ్రీనివాస్ గౌడ్.

 ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ అచ్చంపేట పట్టణ  క్రియాశీల సభ్యుల సమావేశం గండు శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశేట్టి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని తెలిపారు.రానున్న స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించాం అన్నారు.ఇంకా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టే దిశగా వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేసారు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పార్టీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు మరియు సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాంగ్య నాయక్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండికారి బాలాజీ, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీను నాయక్, రాంచంద్రయ్య, రంగినేని రవీందర్, తేజస్విని, చందులాల్ చౌహాన్, శివ చంద్ర,   గోలి రేనయ్య, బయ్యా రాజు,పోల  శ్రీనివాస్, అశోక్, జానకిరాములు,  భాస్కర్,  అభినవ్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.