Take a fresh look at your lifestyle.

సన్‌రైజర్స్‌కు ఇషాన్ కిషన్ సారథ్యం… కమిన్స్ గాయం కారణంగా నిర్ణయం

సన్‌రైజర్స్‌కు కొత్త సారథి 

– ఇషాన్ కిషన్ ఎంపిక!

– ఇన్నాళ్లకు ఓనర్ కావ్య మంచి నిర్ణయం తీసుకుంది!

ముద్ర స్పోర్ట్స్ డెస్క్ :

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను యాజమాన్యం నియమించింది. ప్యాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట అభిషేక్ శర్మకు సారథ్యం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ, చివరకు కిషన్‌కే బాధ్యతలు అప్పగించారు. అభిషేక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ఇటీవల డొమెస్టిక్ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపిన కిషన్ నాయకత్వంపై మేనేజ్మెంట్ విశ్వాసం వ్యక్తం చేసింది. కమిన్స్ కోలుకున్న తర్వాత తిరిగి కెప్టెన్సీ చేపడతాడని ప్రకటించినా, ఈ సీజన్ మొత్తానికి కిషన్ సారథిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తూ, కావ్య మారన్ సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.