Take a fresh look at your lifestyle.

రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి

  • ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
  • మంచాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ముద్ర, ఇబ్రహీంపట్నం: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.మంచాల మండల పరిధిలోని నోముల గ్రామంలో పీఏసీఎస్ మంచాల ఆధ్వర్యంలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, ఆరుట్లలో కూరగాయల మార్కెట్ షెడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి అన్నివర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్నారు. రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతు లందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే వడ్డీ కిందికే పోయేదన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెదిరె హనుమంత్ రెడ్డి, పాండురంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, వి రాంరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.