Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్టలో టీజీ ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు

 ముద్ర ప్రతినిధి, భువనగిరి :
టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాలు, కమాండెంట్ ఎన్. త్రినాధ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి ఈరోజు ఉదయం 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు సాగిన ఈ పరుగులో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
​సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించడం, భక్తులకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ కె. శేషగిరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.