- సింగరేణి ఏరియా జిఎం సుధాకర్ రావు.
యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం.3వ ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. సుధాకర్ రావు, ఓసీపీ.1 ప్రాజెక్టు లో గురువారం 4, కోట్ల 91, లక్షల విలువైన నూతన షావెల్ భారీ యంత్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఉదయం ప్రాజెక్టు ఎస్ అండ్ డి సెక్షన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, బి.ఇ.ఎం.ఎల్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న 6,5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 4, కోట్ల 91, లక్షల వ్యయంతో కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేసి తెప్పించిన షావెల్ భారీ యంత్రాన్ని లాంఛన ప్రాయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన స్థానిక ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రాజెక్టులో జరుగుతున్న ఉత్పత్తి ప్రమాణాల్లో రక్షణ చర్యలను విధిగా పాటిస్తూ, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని కోరారు. ఉత్పత్తి ప్రమాణాలకు అనుగుణంగా నూతన యంత్రాలను కొనుగోలు చేయుటకు అనుమతులను మంజూరు చేసిన సింగరేణి సంస్థ ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.యంత్రాల్లో అమర్చిన రక్షణ పరికరాలు అవసరమైనప్పుడు వినియోగించి ప్రమాదాలు నివారించాలన్నారు. అలాగే యంత్రాల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన టెక్నీషియన్లకు సూచించారు, భద్రతా నియమాలు పాటించడంలో అలసత్వం చేయరాదని ఆయన హితువు పలికారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, సింగరేణి సంస్థ లోనే ఓసిపి.1 ప్రాజెక్టు ముందు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆయన ప్రాజెక్టు కార్మికులను కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వై.వి.రావు, కోట రవీందర్ రెడ్డి, గడ్డం తిరుపతి యాదవ్, అధికారుల సంఘం ప్రతినిధి టి. నాగేశ్వరరావు, ఏరియా ఎస్.ఓ టూ జీఎం యం. రామ్మోహన్, ప్రాజెక్ట్ అధికారి జె. రాజశేఖర్, (ఐఇడి) డిజియం కె. చంద్ర శేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎ. ఉదయ్ భాస్కర్, మేనేజర్ పాపయ్య, అధికారులు జ్ఞానేశ్వర్, నజీర్ అహ్మద్, ప్రాజెక్టు పిట్ కార్యదర్శులు డి.టి.రావు, గునుగంటి వెంకటస్వామి, బి.ఇ.ఎం.ఎల్ కంపెనీ మేనేజర్ శర్మ, ఇతర అధికారులు, ఉద్యోగులు, పాల్గొన్నారు.
