రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : సామాజిక మాధ్యమాల్లో చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మొద్దని గురువారం పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఓ ఆర్.ఎం.పి వైద్యుడిపై మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతికి సరైన కారణం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక ఆధారంగా సంబంధిత వైద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.